Breaking News

Mohan Babu: కోర్టు ధిక్కరణ.. మంచు మనోజ్‌పై పోలీసులకు ఫిర్యాదు

Published on Wed, 01/15/2025 - 19:40

సాక్షి, తిరుపతి: హీరో మంచు మనోజ్‌పై తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్‌ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ విడుదల చేశాడు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మంచు మనోజ్‌ సంక్రాంతి పండక్కి నారావారి పల్లెలో ఉన్న తన మేనత్త మేడసాని విజయమ్మగారి ఇంటికి వెళ్తానని కబురు చేశాడు. అందుకామె ఒప్పుకోలేదు. 

రెండు వందలమందితో లోనికి రావాలని..
అన్న విష్ణు (Manchu Vishnu)తో గొడవపడుతున్నావని, తండ్రి మాట కూడా వినడం లేదు.. కాబట్టి తన ఇంటికి రావొద్దని తెలిపింది. అయినా వినకుండా మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ రోజు నారావారి పల్లెకు వచ్చాడు. నారా లోకేష్ గారిని కలవగా ఆయన ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోయారు. నారా రోహిత్ గారితో కలిసి సినిమా తీస్తున్న కారణంగా ఆయనతో మాట్లాడి వచ్చేశాడు. తిరిగి వస్తున్న క్రమంలో డాక్టర్‌ మోహన్‌బాబు గారి యూనివర్సిటీ గేటు వద్ద 200 మందితో లోనికి రావాలని ప్రయత్నించాడు. 

(చదవండి: మంచు మనోజ్‌ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)

గేటు దూకి లోనికి..
కోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణంలోనికి వెళ్లకూడదని పోలీసులు ఎంతోసేపు చెప్పారు. తర్వాత కొంత ముందుకు వెళ్లి మోహన్‌బాబు విద్యా సంస్థల్లోని డైరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలకు ప్రవేశించాడు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుంది. కాబట్టి ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు, కోర్టుకు అప్పీలు చేస్తున్నాను అని లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నాడు.

చదవండి: పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)