హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. !

Published on Fri, 12/13/2024 - 15:28

టాలీవుడ్ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. ఇటీవల జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధిపై దాడి చేశారంటూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)

ఈ ఘటనపై మోహన్‌బాబు మీడియాను క్షమాపణలు కోరారు. తాను చేసిన పనికి ఎంతో బాధపడుతున్నానని ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టి రావడం న్యాయమేనా? అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఈ ఘటన తర్వాత మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు.

హైకోర్టులో మోహన్ బాబుకు షాక్..

టాలీవుడ్ నటుడు మోహన్‌ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో ఎలాంటి దర్యాప్తు, అరెస్ట్ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)