Breaking News

సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా

Published on Mon, 01/06/2025 - 11:45

కొద్దిరోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో చిక్కుకున్న సినీ నటుడు మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇదే కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అందుకు అంగీకరించని న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఏం జరిగిందంటే?
ఇటీవల మోహన్‌బాబు, మనోజ్‌ మధ్య జరిగిన ఘర్షణ  నేపథ్యంలో మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జర్నలిస్టు రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో ఆయన పహడీ షరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో జర్నలిస్ట్‌పై దాడికి సంబంధించిన కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, డిసెంబర్ 24న పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించడంతో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వబోమని న్యాయస్థానం తెలిపింది. 

దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేడు  ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరగనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)