Breaking News

టాలీవుడ్ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లోబోకు జైలు శిక్ష

Published on Fri, 08/29/2025 - 09:21

టాలీవుడ్ బుల్లితెర నటుడు ఖయూమ్‌ అలియాస్‌ లోబోకు జైలుశిక్ష పడింది. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి మృతికి కారణమైన లోబోకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. బుల్లితెరపై సినీ ప్రియులను అలరించిన లోబో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఓ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ ప్రోగ్రామ్ చిత్రీకరణ కోసం లోబో బృందం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై 2018లో జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో జనగామ కోర్ట్ తీర్పు వెల్లడించింది. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు.

లోబో కెరీర్ విషయానికొస్తే హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ అనే మ్యూజిక్‌ షోతో బాగా పాపులర్‌ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్‌ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్‌ మీద పెద్దగా కనిపించని లోబో బిగ్‌బాస్ రియాలిటీ‌ షో సీజన్-5లో కంటెస్టెంట్‌గా బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)