Breaking News

‘మొహబ్బత్’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌

Published on Fri, 06/05/2026 - 17:43

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మొహబ్బత్’.ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్  క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్  చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు.

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .. ‘సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాల్ని నిర్మిస్తూనే ఉంటారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఇది పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు మ్యాక్‌కి మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు సలీమ్ మాలిక్ (మ్యాక్) మాట్లాడుతూ .. ‘నిర్మాత అఫ్రోజ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘మొహబ్బత్‌’ను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎమోషనల్ యూత్ ఫుల్ జెన్ జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.

నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ .. ‘నా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మొదటి ప్రాజెక్ట్‌గా ‘మొహబ్బత్’ను నిర్మిస్తున్నాను. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మ్యాక్ మంచి దర్శకుడు. సంతోష్, శ్రేయాసిలకు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. మా కోసం వచ్చిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ .. ‘‘మొహబ్బత్’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్ గారు, అఫ్రోజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ .. ‘అఫ్రోజ్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా డైరెక్టర్ మ్యాక్ అద్భుతమైన టాలెంటెడ్. ఇలాంటి ఓ ప్రేమ కథకు సంగీతం ప్రధానం. సునీల్ కశ్యప్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)