Breaking News

కీరవాణి 'ఆస్కార్‌'పై కేంద్ర మంత్రి కామెంట్స్

Published on Sun, 08/20/2023 - 14:32

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిని ఆస్కార్‌ అవార్డు ఆలస్యంగానే వచ్చిందని కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌ అన్నారు. నిర్మాత కేటీ కుంజుమన్‌ 1993లో నిర్మించిన చిత్రం జెంటిల్‌మెన్‌. నటుడు అర్జున్‌, మధుబాల జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం అప్పట్లో సంచల విజయాన్ని సాధించింది. 30 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌ తీస్తున్నారు. దీనికి గోకుల్‌ కృష్ణ దర్శకుడు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: ప్రేయసిని పెళ్లాడిన హీరో, ఫోటోలు వైరల్‌

చేతన్‌ శీను, నయనతార చక్రవర్తి, ప్రియాలాల్‌ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చైన్నె ఎగ్మూర్‌లోని రాజా ముత్తయ్య హాల్లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్న ఈ వేదికపై సంగీత దర్శకుడు కీరవాణిని ఘనంగా సత్కరించారు. కేంద్రమంత్రి మురుగన్‌ మాట్లాడుతూ.. తమిళ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని అన్నారు. 

తమిళ ఇండస్ట్రీ ఇలా పేరు తెచ్చుకోవడంలో ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌ పాత్ర చాలా ఉందని గుర్తుచేసుకున్నారు. నిర్మాత కుంజుమన్‌ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారని, సంగీత దర్శకుడు కీరవాణి 33 ఏళ్లుగా సంగీత రంగంలో ఉన్నారని అన్నారు. ఆయనకు ఆస్కార్‌ అవార్డు ఎప్పుడో రావాల్సిందని, ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చిందనే అభిప్రాయాన్ని మురుగన్ వ్యక్తం చేశారు. ఆయన్ని ఆశీర్వదించడానికి తనకు వయస్సు చాలదని చెప్పుకొచ్చారు. జెంటిల్‌మెన్‌ సీక్వెల్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్‌ పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)