ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌

Published on Wed, 11/05/2025 - 12:12

నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌,సత్య, విష్ణు, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించలేదు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. అయితే, ఈ మూవీకి  సమర్పకులుగా నిర్మాత  బన్నీ వాస్‌ ఉన్నారు.

మిత్రమండలి(Mithra Mandali) సినిమా నవంబర్‌ 6న ఓటీటీ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అమెజాన్‌ ప్రైమ్‌(amazon prime video)లో స్ట్రీమింగ్‌ అవుతుందని ఒక పోస్టర్‌ను షేర్‌ చేశారు. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

కథేంటంటే...
జంగ్లీపట్నానికి చెందిన నారాయణ(వీటీవీ గణేష్‌)కి కులపిచ్చి. తన తుట్టె కులానికి చెందినవాళ్లు ఇతర కులాలకు చెందినవారిని పెళ్లి చేసుకంటే.. వారిని చంపేసే రకం. తుట్టె కులం అండతో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఓ ప్రధాన పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అదే సమయంలో నారాయణ కూతురు స్వేచ్ఛ(నిహారిక ఎన్‌ఎమ్‌) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ ఎస్సై సాగర్‌ (వెన్నెల కిశోర్‌)ని కలుస్తాడు. లంచం ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా తన కూతురు ఆచూకీ కనుక్కోమని చెబుతాడు.

అయితే, స్వేచ్ఛ పారిపోవడం వెనక ఆ ప్రాంతానికి చెందిన నలుగురు కుర్రాళ్లు  ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నలుగురు ఆవారాగాళ్లు. రోజంతా బాతకాలు కొట్టడం.. సాయంత్రం మ​ందేసి చిందులు వేయడమే వీరి పని. ఇలాంటి చిల్లర గాళ్లకి స్వేచ్ఛకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? స్వేచ్ఛ పారిపోవడం వెనున ఉన్న అసలు కారణం ఏంటి?  అనేది తెలియాలంటే సినిమా(Mithra Mandali) చూడాల్సిందే. 
 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)