Breaking News

ఓటీటీలోకి 'టామ్‌ క్రూజ్‌' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Thu, 07/24/2025 - 13:30

హాలీవుడ్‌ చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (Mission Impossible) ఓటీటీలోకి రానుంది.. సుమారు రెండు నెలల తర్వాత అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ సిరీస్‌లో భాగంగా 8వ సినిమాగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టామ్‌ క్రూజ్‌ చేసిన సాహసాలు అత్యంత ప్రమాధకరంగా ఉన్నాయని హాలీవుడ్‌ మీడియా కూడా కథనాలు రాసింది. 

ఆగష్టు 19న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 6వేల కోట్ల వరకు ఈ చిత్రం కలెక్షన్స్‌ రాబట్టింది. సుమారు రూ. 3400 కోట్ల వరకు ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చు చేశారు. క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. 

సిరీస్‌ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్‌ ఇంపాజిబుల్‌. సిరీస్‌ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్‌ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్‌ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌–ది ఫైనల్‌ రికనింగ్‌’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి... అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్‌ ఫీస్ట్‌ అనే చెప్పాలి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)