Breaking News

Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్‌ బ్యూటీ

Published on Sun, 11/17/2024 - 12:57

ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్​ అందాల పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్  గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.

మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్‌' విజేతగా నిలిచారు.  మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్‌లలో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు.  

2023 మిస్‌ యూనివర్స్‌ విన్నర్  'షెన్నిస్​ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు.  'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్‌ బ్యూటీకి అభినందనలు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్‌ యూనివర్స్‌ టీమ్‌ తెలిపింది. ఈ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్‌ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)