Breaking News

చీటింగ్‌ చేసి ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యిందా?.. కో-కంటెస్టెంట్‌ సంచలన ఆరోపణలు

Published on Fri, 11/04/2022 - 12:06

Miss World 2000: గ్లోబర్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాపై మాజీ మిస్‌ బార్బడోస్‌ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్‌ వరల్డ్‌ 2000 పోటీలో రిగ్గింగ్‌ చేసి ప్రియాంక గెలిచిందంటూ ఆమె షాకింగ్‌ చేసింది. దీంతో ఆమె కామెంట్స్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా ఇటీవల జరిగిన యూఎస్‌ఏ 2022(Miss USA 2022) పోటీల్లో రిగ్గింగ్‌ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోటీలో టెక్సాస్‌కు చెందిన రాబోన్‌ గాబ్రియేల్‌ కిరీటం గెలుచుకుంది. చీటింగ్‌ చేసి ఆమె గెలిచిందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పందిస్తూ లీలానీ ఓ యూట్యూబ్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిస్ యూఎస్‌ఏ 2022 పోటీల్లో నిజంగానే రిగ్గింగ్ జరిగిందని, చీటింగ్ చేసి గాబ్రియేల్‌ని గెలిపించారని వ్యాఖ్యానించింది. అనంతరం ‘మిస్ వరల్డ్ 2000 పోటీలలో కూడా రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని గెలిపించారు. మిస్ వరల్డ్ 1999లో ఇండియా నుంచి యుక్తాముఖి గెలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ 2000 సంవత్సరంలో కూడా ఇండియా నుంచి ప్రియాంక చోప్రానే గెలిచింది.

అప్పడు నేను కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాను. ఇలాంటి వాటిల్లో స్పాన్సర్స్ ఎవర్ని గెలిపించమంటే వారినే గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిస్ వరల్డ్ 2000కి జీ టీవీ స్పాన్సర్. ఇది ఇండియాకి చెందినది. అందుకే భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రాని గెలిపించారు. ఆ పోటీల్లో జరిగిన స్విమ్ సూట్ కాంపిటేషన్‌లో అందరూ బికినీలు వేసుకుంటే.. ప్రియాంక మాత్రం వేరే స్విమ్ సూట్ వేసుకుంది. అయినా న్యాయనిర్ణేతలు ఆమెను క్వాలిఫై చేశారు. అప్పుడే అనుమానం వచ్చింది’ అని పేర్కొంది. అలాగే ఈ పోటీలో ప్రియాంకను ప్రత్యేకంగా చూసేవారు.

చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్‌

ఈ పోటీల్లో పాల్గొన్న అందరికి జాసన్‌ వు డిజైనర్‌గా వ్యవహరించాడు. మా అందరికి ఒకే రకమైన ఫ్రాక్స్‌ డిజైన్‌ చేశాడు. కానీ ప్రియాంకకు మాత్రం స్పెషల్‌గా డిజైన్‌ చేశాడు. ఇక 1999లోనే యుక్తాముఖి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్‌ గెలుచుకుంది. అలాగే 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ ఇండియా రన్నరప్‌ నిలిచింది. ఆ తర్వాత మిస్ వరల్డ్ గెలుచుకుంది. ఇలా చాలా అంశాల్లో ప్రియాంక చోప్రాని పైకి తీసుకొచ్చి తనని మిస్ వరల్డ్ చేశారు’ అంటూ బార్బడోస్‌ పేర్కొంది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)