Breaking News

రూ.20 లక్షలు గెలిచా.. ఒక్క పూటలో ఖతం చేశా: యాంకర్‌

Published on Sun, 04/09/2023 - 16:34

ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్తే ఎంత అవుతుంది? వందల్లో, లేదంటే వేలల్లో! కానీ ఓ యాంకర్‌ మాత్రం జస్ట్‌ డిన్నర్‌కే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిందట! హిందీ బుల్లితెర యాంకర్‌ మిని మాథుర్‌ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. 'ఓ క్విజ్‌ షోలో నేను రూ.20 లక్షలు గెలుచుకున్నాను. ఇంకేముందీ, ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్‌, దగ్గరివాళ్లు అందరినీ కలుపుకుని దాదాపు 22 మందిని డిన్నర్‌కు తీసుకెళ్లాను. ఓ పెద్ద ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లి తిన్నాం. అలా నాకు వచ్చిన డబ్బంతా ఒక్కపూటలో ఖర్చైపోయింది.

నేను ఎమ్‌టీవీలో పనిచేసిన తొలినాళ్లలో రూ.50,000 జీతం వచ్చేది. మిగతావాటితో పోలిస్తే అది కొంత తక్కువే! మోడలింగ్‌ విషయానికి వస్తే ఓ అనూహ్య ఘటన వల్ల మోడల్‌గా మారాల్సి వచ్చింది. ఓసారి ఏమైందంటే.. ఓ యాడ్‌ కోసం సుష్మితా సేన్‌ రావాల్సి ఉంది. ఆ ప్రకటనలో ఆమె ఓ పైలట్‌గా నటించాలి. టైం అవుతున్నా తను రాలేదు. ఆలస్యమవుతుండటంతో ఆమె స్థానంలో నన్ను పెట్టి చేశారు' అని చెప్పుకొచ్చింది.

కాగా మిని మాథుర్‌.. ఇండియన్‌ ఐడల్‌ షో మొదటి మూడు సీజన్లకు, అలాగే ఆరో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే కాకుండా మిస్‌ ఇండియా పేజెంట్‌, దిల్‌సే దిల్‌సే ఆజ్‌తక్‌, బాంబే బ్లష్‌, పాప్‌కార్న్‌ జూమ్‌, సిర్ఫ్‌ ఏక్‌ మినిట్‌ మె సహారా వన్‌ వంటి పలు షోలకు హోస్టింగ్‌ చేసింది. దిల్‌ విల్‌ ప్యార్‌ వార్‌, ఐ మే ఔర్‌ మే చిత్రాల్లో మైండ్‌ ద మల్హోత్రాస్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)