Breaking News

బలగం నటుడి షార్ట్‌ ఫిలిం.. ఎలా ఉందంటే?

Published on Wed, 03/20/2024 - 12:44

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనుకునే ఆస్తికులు.. సైన్స్ తప్ప ఈ బ్రహ్మాండాన్ని ఏది నడిపించదు అనుకునే నాస్తికులు.. ఎవరిది నిజం అని చెప్పే ప్రయత్నమే 'బస్‌లో టైం ట్రావెల్‌' అనే షార్ట్‌ ఫిలిం. బలగం నటుడు మీమె మధు, ఆకాశవాణి ప్రభు, కనకరెడ్డి, అన్నపూర్ణ, కిట్టు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కుమార్‌ జాణ దర్శకత్వం వహించగా నరేశ్‌ సముద్రాల నిర్మించాడు. ఈ షార్ట్‌ ఫిలిం ఎలా ఉందో చూసేద్దాం..

డబ్బులొచ్చాక కళ్లు నెత్తికి..
కోటేశ్వరరావు.. కటిక పేదవాడు.. అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడయ్యాడు. కానీ డబ్బుతో పాటు అహం, పొగరు, చెడు అలవాట్లు అన్నీ అలవడ్డాయి. కుటుంబాన్ని సైతం లెక్కచేసేవాడు కాదు. అతడి జీవితంలో జరిగిన ఓ విచిత్రమే ఈ షార్ట్‌ ఫిలిం. అప్పటివరకు కళ్లు నెత్తి మీదున్న కోటేశ్వరరావుకు ఒక్క బస్‌ జర్నీతో తను చేసిన తప్పులేంటో తెలుసుకుంటాడు.

ఒక్క జర్నీతో తప్పు తెలుసుకుని..
పైసా పిచ్చితో కుటుంబాన్ని, జనాలను ఎంత టార్చర్‌ పెట్టాడో అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా మారిపోతాడు. అవమానించిన వాళ్లను ప్రేమించడమే గొప్ప.., సంపాదించడమే గొప్ప అయితే సాటి మానవుడి ఆకలి తీర్చడం అంతకంటే గొప్ప, కనబడని దేవుడిని వెతకకు.. నీలో ఉన్న దేవుడిని వెతుక్కో.. వంటి డైలాగులు బాగున్నాయి. 

అప్పుడు మనిషే దేవుడు
"ప్రతి జీవి దానికి కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. మనిషి దృష్టిలో చీమెంతో, దేవుడి దృష్టిలో మనిషి కూడా అంతే! దేవుడు ఉన్నాడా లేదా అని కనీసం మనుషులుగా వాదించుకుంటున్నాం. మిగతా జీవులన్నిటికి అసలు ఈ వాదనలు కూడా లేవు. ఎందుకంటే దేవుడి కాన్సెప్టే వాటికి తెలియదు. అందుకే కనబడని దేవుడు ఏదో చేస్తాడని చూడక, దేవుళ్ల పేరుతో ఖర్చు పెట్టే కోట్ల డబ్బులో కొంత పేదవారికి ఖర్చు పెట్టండి. అప్పుడు మనిషే దేవుడు అవుతాడు. సాటి మనిషికి సాయం చేసిన వాడే దేవుడు అని చెప్పడం.. బతికే ఈ చిన్న జీవితంలో గొడవలు, కొట్లాటలు, కుళ్లు కుతంత్రాలు మాని అందరితో కలిసి మెలిసి బతకాలని చెప్పడమే.. మా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఉద్దేశ్యం" అని చివర్లో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ షార్ట్‌ ఫిలింను కింద మీరూ చూసేయండి..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)