దిగ్గజ పాప్ సింగర్ బయోపిక్.. రూ.1000 కోట్ల బడ్జెట్?

Published on Mon, 03/11/2024 - 02:24

పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మైఖేల్‌’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మైఖేల్‌ జాక్సన్‌ సోదరుడు జెర్మైన్‌ జాక్సన్‌ తనయుడు జాఫర్‌ జాక్సన్‌ నటిస్తున్నారు. ‘‘జాఫర్‌ అచ్చం మైఖేల్‌ జాక్సన్‌లానే ఉన్నాడు. జాఫర్‌ నడక.. డ్యాన్స్‌... ఇలా అన్నీ మైఖేల్‌లానే ఉంటాయి. అందుకే మైఖేల్‌పాత్రకు జాఫర్‌ తప్ప వేరే ఎవరూ నప్పరు’’ అని ఈ చిత్రదర్శకుడు ఆంటోయిన్‌ ఫుక్వా, నిర్మాత గ్రాహం కింగ్‌ అన్నారు.

ఇప్పటికే విడుదలైన జాఫర్‌ లుక్‌ చూసి, ‘మైఖేల్‌ తిరిగి వచ్చాడా అన్నట్లు ఉంది’ అని అభిమానులు సైతం పేర్కొన్నారు. కాగా, మైఖేల్‌ జీవితంలో ఉన్న వివాదాల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకుపాల్పడ్డారన్నది ఒకటి. అయితే మైఖేల్‌ అమాయకుడని, చిన్నారులను వేధించలేదనే కోణంలో ‘మైఖేల్‌’ చిత్రాన్ని ఆంటోయిన్‌ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఇప్పటివరకూ హాలీవుడ్‌లో రూపొందిన బయోపిక్స్‌లో ‘మైఖేల్‌’ అత్యంత భారీ బడ్జెట్‌ బయోపిక్‌ అంటోంది హాలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్‌. రూ. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌ అని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ‘మైఖేల్‌’ చిత్రం పెట్టిన పెట్టుబడికి రెండింతలు... అంటే రూ. రెండువేల కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. ఇక 2009 జూన్‌ 25న మైఖేల్‌ కన్ను మూసిన విషయం తెలిసిందే. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)