చాలా భయపడ్డా.. పారిపోవాలనిపించింది: షారుక్‌ ఖాన్‌

Published on Wed, 05/07/2025 - 12:26

సెలబ్రిటీల ఫ్యాషన్‌ షో ‘మెట్‌ గాలా’(Met Gala 2025) వేడుక వైభవంగా ప్రారంభమైంది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటిన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ వేదికగా ఈ ఫ్యాషన్‌ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాది ‘మెట్‌ గాలా’ డ్రెస్‌కోడ్‌ ‘టైలర్డ్‌ ఫర్‌ యు’ కాగా, ‘సూపర్‌ఫైన్‌: టైలరింగ్‌ బ్లాక్‌స్టైల్‌’ను థీమ్‌గా నిర్ణయించారు నిర్వాహకులు. ఈ థీమ్‌కు తగ్గట్లుగా ఈ వేడుకలో నలుపు రంగు దుస్తుల్లో పాల్గొన్నారు ప్రముఖులు. 

ఇక ఈ వేడుకలకు హాజరైన తొలి భారతీయ నటుడిగా షారుక్‌ ఖాన్‌( Shah Rukh Khan) చరిత్ర సృష్టించారు. సబ్యసాచి డిజైన్‌ చేసిన దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్‌గా కనపడి, ఈ వేడుకలో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు షారుక్‌ ఖాన్‌. ‘‘ఈ ఏడాది మెట్‌ గాలాకి ఆహ్వానం అందగానే నా కుమారుడు ఆర్యన్, కుమార్తె సుహానా ఎంతగానో సంతోషించారు. ఈ వేడుకలో నేను పాల్గొంటే అది చరిత్ర అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ఇప్పటివరకు రెడ్‌ కార్పెట్‌పై నడవలేదు. నాకు ఫ్యాషన్‌పై ఆసక్తి కూడా తక్కువ. దీంతో ఈ వేడుకకు రావడానికి నేను చాలా భయపడ్డాను. కాస్త బిడియంగా అనిపించింది. ఓ దశలో పారిపోవాలనిపించింది’’ అని పేర్కొన్నారు షారుక్‌ ఖాన్‌. 

ఇంకా ఈ వేడుకలో నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా, ఆమె భర్త–నటుడు నిక్‌ జోనస్, హీరోయిన్‌ కియారా అద్వానీ, సింగర్‌–నటుడు–నిర్మాత దిల్జీత్‌ సింగ్‌ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఇక త్వరలో తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఈ వేడుకలో ‘బేబీ బంప్‌’తో మెరిశారు. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)