Breaking News

ఓ ప్రేమ... ప్రేమ

Published on Sun, 02/23/2025 - 00:56

సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేకా పటేల్‌ జంటగా రతన్‌ రిషి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్టిస్ట్‌’. ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జేమ్స్‌ వాట్‌ కొమ్ము నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

‘జారే కన్నీరే అడుగుతుందా.. . నేరం ఏముందో చెప్పమంటూ... నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా... నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా...’ అంటూ భావోద్వేంగా సాగుతుందీ పాట. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని రమ్యా బెహ్రా పాడారు. ‘‘ఒక వినూత్నమైన ప్రేమ కథతో ‘ఆర్టిస్ట్‌’ సినిమా రూపొందింది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ‘చూస్తూ చూస్తూ..’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘సత్యం’ రాజేశ్, వినయ్‌ వర్మ, తనికెళ్ల భరణి, పి.సోనియా ఆకుల, స్నేహా, మాధురి శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: చందూ ఏజే, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: సురేష్‌ బసంత్, లైన్‌ ప్రోడ్యూసర్‌: కుమార్‌ రాజా.  
 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)