జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్‌ దిల్‌సే ఎమోషనల్‌

Published on Sat, 02/15/2025 - 19:20

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే (Mehaboob Dil Se) సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తమ కుటుంబంలోకి ఓ బుడ్డోడు వచ్చాడంటూ మురిసిపోతున్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మా కుటుంబంలో మరొకరు చేరారు. ఆనందభాష్పాలతో తనకు సాదర స్వాగతం పలుకుతున్నాం. 

మా లైఫ్‌లో నువ్వే పెద్ద గిఫ్ట్‌
నా తమ్ముడు సుభాన్‌కు బాబు పుట్టాడు. అతడి రాకతో మా ఇల్లు మరింత ప్రేమమయంగా, నవ్వుల హరివిల్లుగా మారుతోంది. ఈ బుడ్డోడు ఇప్పటికే మాలో అంతులేని ఆనందాన్ని నింపాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతి అని చెప్పకనే చెప్పాడు. మా బుడ్డోడు జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. తండ్రిలాగే కరుణామయుడిగా, బలవంతుడిలా ఎదగాలని ఆశిస్తున్నాను. 

మరి నీ పెళ్లెప్పుడు?
వీడ్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు మా కుటుంబ బంధం మరింత బలపడినట్లు అనిపిస్తోంది అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది చూసిన అభిమానులు మెహబూబ్‌ పెదనాన్న అయినందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పనిలో పనిగా పెళ్లెప్పుడు చేసుకుంటావని ఆరా తీస్తున్నారు. దీనికి మెహు స్పందిస్తూ.. ఇప్పటికే ఇంట్లో పదేపదే పెళ్లి ప్రస్తావనే తెస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అని తల పట్టుకున్నాడు.

 

 

చదవండి: రూ.8 కోట్లు పెడితే రూ.55 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)