Breaking News

'ఆ గొంతు ఎప్పటికీ  వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

Published on Sun, 08/06/2023 - 18:01

ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గొంతు అజరామరం అంటూ కొనియాడారు. ప్రజా ప్రయోజనాల కోసం గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు గద్దర్ అంటూ ప్రశంసించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు గద్దర్‌కు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. కాగా.. చిరంజీవి నటించిన చిత్రం గాడ్‌ ఫాదర్‌లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. 

(ఇది చదవండి: గద్దర్ మృతికి ప్రధాన కారణమిదే!)

మెగాస్టార్ ట్వీట్‌లో రాస్తూ..'  వారి గళం అజరామరం. ఆయన ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు. 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటలు, పాటలతో  దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ  వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ,లక్షలాది అభిమానులకు , శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సంతాపం!' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్  ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు. 

(ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్‌ మరణంపై ఆర్‌ నారాయణమూర్తి దిగ్భ్రాంతి)

హీరో బాలకృష్ణ సంతాపం

ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారంటూ కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు  బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా  అని అన్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ సంతాపం

ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన ప్రజా గాయకుడు గద్దర్.. మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మనతోనే సజీవంగానే ఉంటాయని అన్నారు.  ఆయన కుటుంబ సభ్యులకు, కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)