Breaking News

అ‍ల్లు అర్జున్‌కు మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే విషెస్‌.. ట్వీట్‌ వైరల్‌

Published on Sat, 04/08/2023 - 10:07

మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐకాన్‌ స్టార్‌గా క్రేజ్‌ దక్కించుకున్నాడు అల్లు అర్జున్‌. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని నేషనల్‌ స్టార్‌గా ఎదిగాడు.నేడు(శనివారం) అల్లు అర్జున్‌ 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి బన్నీకి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో తన మేనమామ, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. 'హ్యాపీ బర్త్‌డే డియర్‌ బన్నీ.. పుష్ప-2 ది రూల్‌ ఫస్ట్‌ లుక్‌ రాకింగ్‌గా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌' అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాగా చిరంజీవి సినిమాతోనే అల్లు అర్జున్‌ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించిన బన్నీ ఆ తర్వాత ‘స్వాతిముత్యం’, ‘డాడీ’ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. నేడు పుష్ప చిత్రంతో పాన్‌ఇండియా స్థార్‌గా సత్తా చాటుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)