Breaking News

నా హృదయం సంతోషంతో నిండిపోయింది: మెగాస్టార్ చిరంజీవి

Published on Thu, 03/20/2025 - 15:53

యూకే పార్లమెంట్‌లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా  హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)