Breaking News

'భోళా శంకర్'పై చిరు గట్టి నమ్మకం.. కామెంట్స్ వైరల్

Published on Mon, 08/07/2023 - 04:19

‘‘రీమేక్స్‌ చేస్తారేంటి? అని అంటుంటారు. మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం మన యాక్టర్స్, దర్శకులు చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ‘వేదాళం’ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లేదు. ఎవరూ చూసి ఉండరు. ఆ ధైర్యంతోనే మెహర్, అనిల్‌ నా వద్దకు రావడంతో ‘భోళాశంకర్‌’ చేశాను’’ అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భోళాశంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘భోళాశంకర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భోళాశంకర్‌’ సినిమా నాకు నచ్చింది కాబట్టే చేశాను. మీకు (ప్రేక్షకులు) కూడా నచ్చుతుందనే ధైర్యంతో విడుదల చేస్తున్నాం. స్వయంకృషితో మెహర్‌ రమేశ్‌ దర్శకుడిగా ఎదిగాడు. కొత్తవారి ప్రతిభతో ఇండస్ట్రీ మరింత ఎదగాలి. ఇండస్ట్రీని నమ్ముకుని వస్తే గొప్ప లైఫ్‌ని ప్రసాదిస్తుంది. ఇండస్ట్రీ పుష్పక విమానంలాంటిది.. ఎంతమంది వచ్చినా ఇంకా చోటు మిగిలే ఉంటుంది.

ఇండస్ట్రీ అక్షయ పాత్రలాంటిది. ఎంతమంది తిన్నా కూడా ఇంకా భోజనం అందిస్తుంది ఈ కళామతల్లి. కేవలం స్టార్స్‌ మాత్రమే ఉండే ఈ ఇండస్ట్రీలోకి బిక్కు బిక్కు మంటూ నేను ప్రవేశించాను. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నా లోపల ధైర్యం ఉంది. ‘కొత్త అల్లుడు’ సినిమాలో ఓ చిన్న వేషం వేయమన్నారు.. బాధగా అనిపించింది కానీ చేశాను. అలాగే ‘కొత్తపేట రౌడీ’  సినిమాలో కృష్ణగారి పక్కన చిన్న వేషం వేయమన్నారు. ఓ వైపు ‘శుభలేఖ’, ‘ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య’ వంటి సినిమాలు చేస్తున్నాను.. ఇప్పుడు ఇలాంటి రోల్స్‌ చేస్తే బాగుంటుందా? అంటే.. ‘చేయండి సార్‌’ అన్నారు.

చేయనంటే నా భవిష్యత్‌ మీద ప్రభావం పడుతుందేమో అనే భయంతో చేశాను. కానీ, ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన దానికంటే... నన్ను ప్రోత్సహించి, భుజాన ఎత్తుకుంది, పైకి లేపింది ప్రేక్షకులు. వారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మీరంతా (అభిమానులు) చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను చిరంజీవిగారితో సినిమాలు చేస్తూ పెరిగాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌ . ‘‘చిరంజీవిగారితో సినిమా చేయడాన్ని లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు అనిల్‌ సుంకర్‌. ‘‘ఒక షాడోలో ఉన్న నా మీద మెగాస్టార్‌ అన్నయ్య వెలుగు పడింది. ‘భోళా శంకర్‌’ నాకు దర్శకుడిగా పునర్జన్మలాంటిది’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు దర్శక– నిర్మాతలు పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)