Breaking News

'అల్లు అరవింద్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే ఓకే చెప్పారు' మెగాస్టార్ చిరంజీవి

Published on Sun, 08/31/2025 - 10:40

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి, అల్లు అర్జున్‌ నానమ్మ కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ముంబయి నుంచి హైదరాబాద్‌ చేరుకుని ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రామ్ చరణ్ సైతం మైసూర్‌లో నుంచి నగరానికి వచ్చేశారు. శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించారు.

‍అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తమ్మ కనకరత్నం గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆమె బతికి ఉన్నప్పుడే తన కళ్లు దానం చేయాలని మాతో చెప్పిందని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే ఐ బ్యాంక్‌కు ఫోన్‌ చేసి కళ్లను దానం చేశామని వెల్లడించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు.

మెగాస్టార్ మాట్లాడుతూ..'తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఆమె లేరని వార్త తెలిసింది. అరవింద్ అప్పటికే బెంగళూరులో ఉన్నారు. నేనే అక్కడికి ముందు వెళ్లాను. ఆమె చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చి.. మూడు గంటల సమయంలో ఐ‌ బ్యాంక్‌కు ఫోన్ చేశా. ఐ డొనేషన్‌కు ఏర్పాటు చేయమన్నా. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న అల్లు అరవింద్‌కు ఫోన్ చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారని' అన్నారు. ఆమె నేత్ర దానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)