Breaking News

తండ్రికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి

Published on Mon, 12/30/2024 - 15:34

మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులర్పించారు. చిరంజీవి(Chiranjeevi) తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్‌ చిరు తల్లి అంజనాదేవితో పాటు నాగబాబు దంపతులు ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేశారు. 'జన్మనిచ్చిన మహానీయుడిని ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ' అంటూ ఫోటోలు, వీడియోను పంచుకున్నారు.

కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మెగాస్టార్‌తో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ జన్మించారు. కాగా.. చిరంజీవి తండ్రి వెంకటరావు కానిస్టేబుల్‌గా పనిచేశారు.

కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర(vishwambhara) చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. విశ్వంభరలో చిరంజీవి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లోత్రిశూలంతో చిరంజీవి కనిపించారు. 'చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించిన సమయంలో ఒక అద్భుతమైన తార పోరాడేందుకు ప్రకాశిస్తుంది.' అని పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ తెలిపింది.

కాగా.. కోలీవుడ్ భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్‌ యాక్షన్  సీక్వెన్స్ విజువల్‌ వండర్‌లా ఉండబోతోందని గతంలోనే చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ‍‍అవకాశముంది.

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)