Breaking News

నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్

Published on Wed, 02/01/2023 - 15:17

హాస్యనటుడు అనే పదం ఆయనకు సరిపోదేమో.. ఎందుకంటే అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించాడు. హాస్యమే ఆయన కోసం పుట్టిందంటే ఆ పదానికి సరైన అర్థం దొరుకుతుందేమో. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయనే టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి  శుభాకాంక్షలు తెలిపారు . బ్రహ్మనందం అసమాన ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్విటర్‌లో సందేశం పోస్ట్ చేశారు. 

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'నాకు తెలిసిన బ్రహ్మనందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజు బ్రహ్మనందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మనందానికి హృదయపూర్వక శుభాభినందనలు. 

బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మనందంకు మరింత బ్రహ్మండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.  హాస్య నటుడు బ్రహ్మనందంకు టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు  చెబుతున్నారు. 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)