Breaking News

నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

Published on Fri, 01/26/2024 - 11:33

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్‌లోని తన బ్లడ్‌ బ్యాంక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్‌ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నా  సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 
 
మెగాస్టార్‌ తన ట్వీట్‌లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్‌లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి