Breaking News

ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్

Published on Mon, 10/28/2024 - 21:09

పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఏఎన్‌ఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.

ఏఎన్నార్‌ అవార్డ్‌ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, గిన్నిస్‌ బుక్‌తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది.  అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)