Breaking News

వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్

Published on Sun, 08/06/2023 - 21:44

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీ అయిపోయింది చిత్రబృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్.. తమన్నా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. అదేంటో ఓసారి తెలుసుకుందాం. 

(ఇది చదవండి: ఆస్కార్‌ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి )

చిరంజీవి మాట్లాడుతూ..'భోళా శంకర్‌లో మిల్కీబ్యూటీ అనే సాంగ్ ఉంది. ఇది స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించాం.దాదాపు రెండు వారాలు  షూటింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో తమన్నా ఫాదర్‌కు సర్జరీ జరిగిందని విన్నా. ఆ సమయంలో కూడా తమన్నా వెళ్లలేదు. కెమెరా ముందుకు వచ్చి డాన్స్ వేయడం.. అంతలోనే కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని సూచించింది. తనకి బాధను దిగమింగుకుని డాన్స్ చేస్తుంటే సినిమాపై  ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.' అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సైతం తమన్నాను అభినందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కించారు.

(ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి