Breaking News

థియేటర్లలో వరుణ్ తేజ్ మట్కా.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

Published on Thu, 11/14/2024 - 09:03

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళే విడుదలైంది.  కోలీవుడ్ స్టార్ సూర్య మూవీ కంగువాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. మట్కా, జూదం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో వరుణ్ తేజ్‌ తొలిసారిగా డిఫరంట్‌ రోల్‌లో కనిపించారు.

కాగా.. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్‌ షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మట్కా మార్నింగ్ షోలు మొదలయ్యాయి. దీంతో మూవీ చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మట్కా అద్భుతంగా ఉందని.. మంచి స్టోరీ అని, ఫైట్ సీక్వెన్స్‌ బాగున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. కామెడీ, యాక్షన్‌, సెంటిమంట్‌, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటికి సాక్షి ఎలాంటి బాధ్యత వహించదు.

కాగా.. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తోన్న మట్కా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీతో తెలుగులో నోరా ఫతేహీ అరంగేట్రం చేయనుంది. మట్కా జూదగాడైన రతన్ ఖేత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సలోని అశ్వని, సత్యం రాజేష్, పి రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.

 

 

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)