Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
సింగర్ సునీత పెళ్లి.. నాగబాబు కామెంట్స్
Published on Wed, 01/13/2021 - 15:34
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గాయనీ సునీత ఇటీవల మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సునీతకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహమని తెలిసిందే. దీంతో ఎదిగిన పిల్లల ఎదురుగా సునీత ఇలా ఆనందంగా పెళ్లి చేసుకొవడంతో నెటిజన్‌లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. (చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్)
ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. వారి వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సంతోషం అనేది పుట్టుకతో రాదు. దానిని మనమే వెతికి అందుకోవాలి. రామ్, సునీత కూడా అదే చేశారు. వారిద్దరూ తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు అభినందనలు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వీరి జంట ఆదర్శంగా నిలిచింది. ప్రేమ, ఆనందం వారి శాశ్వత చిరునామాగా మారాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీటర్ వేదికగా సునీత-రామ్‌లకు ఆయన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అలా.. రామ్‌తో పరిచయం ఏర్పడింది: సునీత)
Happy Married Life to You Two @OfficialSunitha & @ramveerapaneni pic.twitter.com/OEPMKxZnxl
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2021
Tags : 1