Breaking News

చిరు సినిమా: అనిల్‌ రావిపూడి కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం!

Published on Tue, 04/01/2025 - 18:20

అనిల్‌ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్‌లో హిట్‌ సినిమాకు ఈ పేరు కేరాఫ్‌గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే. స్టార్‌ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తాడు. రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో  విక్టరీ వెంకటేశ్‌కి భారీ బ్లాక్‌ బస్టర్‌ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. 

ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి కూడా మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్‌ టైటిల్‌) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్‌ కంటే ముందే ప్రమోషనల్‌ వీడియోని వదిలాడు అనిల్‌. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ వీడియోని క్రియేట్‌ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్‌ తన ఫోకస్‌ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్‌.. ఈ చిత్రం భారీ హిట్‌ కావడంతో తన రెమ్యునరేషన్‌ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్‌ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. 

 కెరీర్‌ ప్రారంభంలో పటాస్‌ చిత్రానికి అనిల్‌  రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు.  సూపర్‌ హిట్‌ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)