Breaking News

23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?

Published on Tue, 01/28/2025 - 12:51

చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్‌ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్‌ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్‌ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్‌ అవుతున్నారు.  హీరోయిన్లను మించిన క్రేజ్‌ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా.. ఇది వాస్తవమే.

షారుఖ్‌ని మించిన అభిమానం.. 
బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్స్‌తో షారుఖ్‌ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్‌ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో షారుఖ్‌ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్‌ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఎపిసోడ్‌కి 18 లక్షలు
జన్నత్‌ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్‌ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్‌ విల్‌ పీపుల్‌ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. 

ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్‌.. ఒక్కో ఎపిసోడ్‌కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకుందట. ఇక సీరియల్‌ కోసం ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట.  అలాగే సోషల్‌ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)