Breaking News

మీనాక్షి చౌదరి పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Published on Sat, 12/06/2025 - 10:25

టాలీవుడ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. హీరో సుశాంత్‌తో కొంత కాలంగా ఆమె ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఇదే అంశంపై కొద్దిరోజుల క్రితం మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్.. నేను పెళ్లి చేసుకోవడం లేదని గట్టిగానే చెప్పారు. అయినప్పటికీ సోషల్‌మీడియాలోని కొన్ని మీమ్‌ పేజీలు మాత్రం వైరల్‌ చేస్తూనే ఉన్నాయి. రెండురోజులుగా మళ్లీ ఇదే తంతు నెట్టింట కనిపిస్తుంది. వచ్చే ఏడాదిలో​ మీనాక్షి, సుశాంత్‌ల పెళ్లి అంటూ ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై మీనాక్షీ టీమ్‌ రియాక్ట్‌ అయింది.

కొద్దిరోజుల క్రితం మీనాక్షి చౌదరి, సుశాంత్‌ ఇద్దరూ ఒక ఎయిర్ పోర్టులో కలిసి కనిపించారు. ఇంకేముంది పెళ్లి వార్తలు లింకు చేశారు. దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ఆమె టీమ్‌ స్పందించింది. వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మీనాక్షికి సంబంధించి ఏదైనా విషయం ఉంటే తాము తప్పకుండా అందరికీ తెలుపుతామన్నారు. ఇకనైన ఈ రూమర్స్ కి పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరుతున్నట్లు వారు అభ్యర్థించారు.  హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి కలిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాలో నటించారు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)