Breaking News

యాక్టింగ్‌ వదిలేద్దామనుకున్నాను: మీనాక్షీ చౌదరి

Published on Mon, 01/12/2026 - 03:10

‘‘మన జీవితాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నా జీవితాన్ని మా అమ్మ, మా టీచర్స్‌ ఎంతో ప్రభావితం చేశారు. ఇప్పుడు హీరోయిన్లకు బలమైనపాత్రలు లభిస్తుండటం సంతోషంగా ఉంది. నేను కూడా బలమైనపాత్రలే చేయాలనుకుంటున్నాను. హీరోయిన్ల మధ్యపోటీ గురించి ఆలోచించను.పోటీ అనేది ప్రతిచోటా ఉంటుంది. నా వరకు క్రమశిక్షణతో కష్టపడుతుంటాను. నా స్కూల్, కాలేజీ, మిస్‌ ఇండియా కాంపిటీషన్.. ఇలా ప్రతిచోట నేనుపోటీ చూశాను’’ అని చెప్పారు హీరోయిన్ మీనాక్షీ చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి జోడీగా నటించిన సినిమా ‘అనగనగా ఒకరాజు’. 

మారి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ–‘‘2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’, 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’తో ఆడియ న్స్ ముందుకు వస్తున్నాను. అయితే నేను ఏదీప్లాన్ చేయలేదు. ‘అనగనగా ఒకరాజు’ చిత్రంలో సంపన్న కుటుంబంలో పుట్టిన చారులత అనేపాత్రలో నటించాను. నవీన్గారితో వర్క్‌ చేయడం అనేది సినిమా టీచింగ్‌ స్కూల్‌లా ఉంది.

‘గుంటూరు కారం, లక్కీభాస్కర్‌’ తర్వాత ఇప్పుడు ‘అనగనగా ఒకరాజు’ సినిమాలు సితార బ్యానర్‌లో చేశాను. మారి మంచి ప్రతిభగల దర్శకుడు. ఇండస్ట్రీలో నటిగా సెటిల్‌ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు నూతన నటీనటులు వస్తూనే ఉంటారు. దీంతో ప్రతి రోజూ పరుగే. నటిగా ‘ఔట్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది నా తొలి సిరీస్‌ (టీవీ సిరీస్‌). ఈ షూట్‌లోపాల్గొన్న తొలిరోజే నాకు ఇబ్బందిగా అనిపించి, నా మేనేజర్‌కి కాల్‌ చేసి, ‘యాక్టింగ్‌ వద్దు. సినిమాలు వదిలేద్దామనుకున్నాను’ అని చెప్పాను. మనం కాంట్రాక్ట్‌ సైన్ చేశామని చెప్పి నన్ను కన్వి న్స్ చేశారు. ఆ తర్వాత యాక్టర్‌గా నేను మెరుగై రాణిస్తున్నాను. ఇక సోషల్‌ మీడియా ట్రోల్స్‌ నన్ను బాధపెట్టాయి. నాకు పుస్తకాలు రాయడం ఇష్టం. నాగచైతన్యగారితో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాను’’  అన్నారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)