Breaking News

సవతి తల్లి.. అర్థాన్నే మార్చేసింది, నాన్న ఆమెను కొట్టలేదు!

Published on Sun, 03/31/2024 - 16:58

విషాద పాత్రలు పోషించడం, విషాదభరితమైన సీన్లు రక్తికట్టించడం అంత ఈజీ కాదు. కానీ అటువంటి పాత్రలను అలవోకగా చేసి ట్రాజెడీ క్వీన్‌ ఆఫ్‌ బాలీవుడ్‌గా కీర్తి గడించింది మీనా కుమారి. కానీ తన జీవితంలో కూడా అంతే ట్రాజెడీ ఉంటుందని బహుశా ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. సినిమాల ద్వారా పేరు, డబ్బు సంపాదించింది కానీ ప్రేమ, పెళ్లి వల్ల తన జీవితాన్నే నాశనం చేసుకుంది.

ఫస్ట్‌ లవ్‌..
మీనా కుమారి.. ధర్మేంద్రను తొలిచూపులోనే ప్రేమించింది. అటు ధర్మేంద్ర ఆమెను గురువుగా, గైడ్‌గా భావించేవాడు. చివరికి ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. కానీ ఆమెకు నచ్చినట్లుగా కాకుండా తనకు నచ్చినట్లుగానే ఉండేవాడు. అలా మూడేళ్లకే బంధం ముగిసిపోవడంతో మీనా కుమారి మందుకు బానిసైంది. ఆ సమయంలో దర్శకుడు కమల్‌ ఆమ్రోహి ఆమెకు దగ్గరయ్యాడు. అతడి సినిమా అనార్కలి కోసం మహాబలేశ్వర్‌ వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో గాయపడింది. మూడు నెలలు ఆస్పత్రిలో ఉంటే ఆమె బాగోగులు చూసుకున్నాడు కమల్‌. అటు అనార్కలి సినిమా అటకెక్కింది. ఇటు మీనా, కమల్‌ల స్నేహం, ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కమల్‌కు పెళ్లయి పిల్లలున్నారు. పైగా ఆమె కంటే 16 ఏళ్లు పెద్దవాడు కూడా!

తాగుడుకు అలవాటై
పెళ్లి తర్వాత తనకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సాయంత్రం ఆరున్నరకల్లా ఇంటికి చేరుకోవాలని ఆదేశాలు.. తను పంపిన కారులోనే షూటింగ్‌ వెళ్లిరావాలని ఆంక్షలు.. కోస్టార్స్‌తో చనువుగా కనిపించొద్దని నిబంధనలు.. ఆమెను గమనించేందుకు ఓ వ్యక్తినీ నియమించాడు. అతడి పొసెసివ్‌నెస్‌ భరించలేకపోయింది. ఎనిమిదేళ్లకే ఇద్దరూ విడిపోయారు. మళ్లీ మద్యానికి బానిసై లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధి బారిన పడింది. 38 ఏళ్లకే మరణించింది. నేడు(మార్చి 31) ఆమె వర్ధంతి.


మీనా కుమారి, కమల్‌ ఆమ్రోహి

దుష్ప్రచారం
ఈ సందర్భంగా మీనా భర్త కమల్‌ అమ్రోహి మొదటి భార్య కుమారుడు తాజ్దార్‌ ఆమ్రోహి.. నటితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. మా నాన్న- పిన్ని(మీనా) విడాకులు తీసుకోలేదు. భేదాభిప్రాయాల వల్ల విడివిడిగా జీవించారంతే! నాన్న.. పిన్నిని కొట్టాడని దుష్ప్రచారం చేశారు. ఆయన ఏనాడూ తనపై చేయి చేసుకోలేదు. ఆరేళ్ల వయసులో సవతి తల్లిదగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత ఎన్నడూ మళ్లీ ఇంటికి వెళ్లలేదు. కన్నతల్లి కూడా గుర్తురానంత ప్రేమను పంచింది.

ఉత్తరాలు, బహుమతులు
నేను లేకుండా నిద్రపోయేదే కాదు. తన కారు వచ్చిందనగానే పరుగెత్తుకుంటూ వెళ్లేవాడిని. విద్యాభ్యాసం కోసం డెహ్రాడూన్‌ వెళ్లినప్పుడు నాకోసం ఉత్తరాలు రాసేది, బహుమతులు పంపేది. నాకేదైనా కావాలంటే వెంటనే పంపించేది. నేను అక్కడ ఉన్నప్పుడే వాళ్లు విడిపోయారు. నాన్న గురించి పిన్నికి లేనిపోనివి చెప్పి విడగొట్టేలా చేసినవారెవరో కూడా నాకు తెలుసు. కానీ నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయిందని కోపం ఉండేది.


తాజ్దార్‌  ఆమ్రోహి, మీనా కుమారి

తనమీద కోపం
తను అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను చూడాలనుందంటే వెళ్లాను. అది 1967.. తను నన్ను చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను (ఏడుస్తూ..). అనారోగ్యం వల్ల జుట్టంతా ఊడిపోయింది. బెడ్‌పై నుంచి లేవడానికి ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావడం లేదు. నేను వెళ్లి తనను కూర్చోబెట్టాను. నా మీద కోపంగా ఉన్నావా? అంటూ నా తల నిమురుతూ ప్రేమ కురిపించింది. సవతి తల్లి అనే పదానికి ఉన్న అర్థాన్నే ఆవిడ మార్చేసింది. కాస్త కోలుకున్నాక.. నాకోసమే ఆగిపోయిన పాకీజా సినిమాను మా నాన్నతో కలిసి పూర్తి చేసింది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)