Breaking News

ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా

Published on Wed, 02/26/2025 - 13:11

కామెడీ సినిమాలకు తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో ఎవరైనా సరే మూవీ బాగుంటే చాలు ఆదరిస్తారు. అలాంటి నమ్మకంతో  శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది 'మజాకా'. సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రీతూ వర్మ,  'మన్మథుడు' పేమ్ అన్షు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ వివరాలు కూడా బయటకొచ్చాయి.

కొడుకుతో పాటు తండ్రి ప్రేమలో పడటం, అలా అమ్మాయిల వెనక తిరగడం అనే కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపించారు. అలా 'మజాకా'.. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే మిశ్రమ స్పందన వస్తోంది. వీకెండ్ వచ్చేసరికి అసలు టాక్ ఏంటనేది తెలుస్తుంది.

(ఇదీ చదవండి: తేళ్లు, బొద్దింకలు తింటాను: తెలుగు హీరోయిన్‌)

ఇక ఓటీటీ హక్కులు విషయానికొస్తే చాలారోజుల క్రితమే డీల్ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మంచి రేటుకే డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారం ఈ మూవీ డిజిటల్ గా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ)

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)