Breaking News

మాయాబజార్‌ని థియేటర్స్‌లోనే చూడండి: ఎస్వీ కృష్ణారెడ్డి

Published on Wed, 05/21/2025 - 00:32

‘‘ఎన్‌టీఆర్‌గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ‘మాయాబజార్‌’ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ రోజున చూసేందుకు రెండు టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లోనే చూడండి’’ అని డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌వీ రంగారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయాబజార్‌’.

కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయాప్రోడక్షన్స్పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ సినిమా 1957 మార్చి 27న విడుదౖలñ ంది. ఈ నెల 28న ఎన్‌టీఆర్‌ 102వ జయంతి సందర్భంగా ‘మాయాబజార్‌’ చిత్రాన్ని బలుసు రామారావు రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాయాబజార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎన్‌టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ’ చైర్మన్   టి.డి.జనార్ధన్  మాట్లాడుతూ– ‘‘రీ రిలీజ్‌లోనూ ‘మాయాబజార్‌’ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

నిర్మాత రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ–‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్, రామారావుగారు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు’’ అని తెలిపారు. ‘‘అలనాటి క్లాసిక్‌ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ఈ వేడుకలో వీర శంకర్, భగీరథ, త్రిపురనేని చిట్టి, బలుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు