Breaking News

'మత్తు వదలరా' సీక్వెల్‌ విడుదలపై ప్రకటన

Published on Mon, 08/26/2024 - 17:47

సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి చిన్న తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం 'మత్తు వదలరా'. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు శ్రీసింహా తన తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

అయితే, ఈ సినిమా తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ లాంటి సినిమాలు శ్రీసింహ చేసినా పెద్దగా మెప్పించలేకపోయాడు. దీంతో తన హిట్‌ సినిమా మత్తు వదలరా సీక్వెల్‌ను స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు.

డైరెక్టర్ రితేష్- శ్రీసింహా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ 13న 'మత్తు వదలరా-2' చిత్రాన్ని విడుదల చేస్తామని ఒక పోస్టర్‌తో మేకర్స్‌ ప్రకటించారు. పార్ట్‌-1లో శ్రీ సింహతోపాటు అతని సహచరుడిగా నటించిన సత్య కూడా ఈ సీక్వెల్లో ఉండనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి కొత్తగా ఫరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)