Breaking News

ఓటీటీలో 'మత్తువదలరా 2' స్ట్రీమింగ్‌

Published on Fri, 10/11/2024 - 13:53

శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫన్‌ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్‌ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్​టైనర్‌గా విజయం సాధించిన  ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.

సెప్టెంబర్‌ 13న విడుదలైన  ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది.

కథేంటంటే.. 
‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్‌ అయిన బాబు మోహన్‌(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్‌(హై ఎమర్జెన్సీ టీమ్‌)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్‌ యాడ్‌ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్‌ కేసులను డీల్‌ చేయడం వీళ్ల పని.

వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్‌ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్‌ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్‌ చేసి రూ. 2 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్‌ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్‌ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్‌ ఆకాశ్‌(అజయ్‌) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్‌ చేసిందెవరు..? స్టార్‌ హీరో యువ(వెన్నెల కిశోర్‌)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్‌ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)