Breaking News

'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..'

Published on Sun, 09/15/2024 - 17:38

గర్భిణీ స్త్రీలు కనిపిస్తే చాలు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ ఎర్రగా, తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి, ఈ చిట్కాలు పాటించాలని ఏవేవో చెప్తుంటారు. ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి మసాబా గుప్తాకు కూడా ఈ ఉచిత సలహాలు వస్తూనే ఉన్నాయట!

ఏం చేయాలి?
దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'నిన్న నా దగ్గరకు వచ్చిన ఒకరు ప్రతిరోజు ఒక రసగుల్లా తింటే పుట్టబోయే బిడ్డ నాకంటే కొంత మెరుగైన రంగుతో పుడుతుందని చెప్పింది. అంతకుముందు మరొకరు కచ్చితంగా పాలు తాగాలని చెప్పారు. నా బిడ్డ నల్లగా పుట్టకూడదని ఆమె ఆకాంక్షించారు. తన అమాయక మాటలు విని నాకేం చేయాలో అర్థం కాలేదు. కోపంతో తనను కొట్టలేనుకదా..!

ఇప్పటికీ అదే ఘోరం..
ఈ నలుపు-తెలుపు విభేదాలు ఇప్పట్లో మారవు. నేను చేయాల్సిందల్లా ఒక్కటే! నా బిడ్డను స్ట్రాంగ్‌గా తయారుచేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది నల్లగా ఉన్నవారిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. వారిని మానసికంగా ఓ మెట్టు కిందకు లాగుతారు. ఇదెంత ఘోరం.. 2024వ సంవత్సరంలోనూ ఇదే జరుగుతోంది. చదువుకున్నవారు, చదువుకోనివారు, ఉన్నవారు, విజ్ఞానులు.. ఇలా అందరి విషయాల్లోనూ ఇదే పునరావృతం అవుతూనే ఉంది' అని చెప్పుకొచ్చింది.

ఎవరీ  మసాబా గుప్తా
కాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్‌ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్‌ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)