కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2'
Published on Tue, 03/31/2026 - 16:14
సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్‌బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.
మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.
మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్‌ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.
చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్‌తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.
(ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్)
Tags : 1