Breaking News

భార్యతో తెగదెంపులు, మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు

Published on Fri, 01/02/2026 - 15:29

పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.

మళ్లీ కలిసే ప్రసక్తే లేదు
ఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. 

లోపించిన సఖ్యత
మూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్‌ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. 

ముగ్గురు పిల్లలు
ఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్‌ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. 

సీరియల్స్‌, సినిమా
దివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్‌, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్‌ 'నరనాతు తంపురాన్‌' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్‌, పంచాంగి వంటి సీరియల్స్‌ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్‌', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.

చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)