Breaking News

అన్నంత పని చేసిన మన్సూర్ అలీఖాన్

Published on Sat, 12/09/2023 - 09:19

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ శుక్రవారం నటి త్రిష కృష్ణన్, నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్, నటుడు చిరంజీవిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు. మన్సూర్ అలీఖాన్ వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ సోమవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

నటి త్రిష కృష్ణన్‌పై మన్సూర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనను నటి త్రిష కృష్ణన్, LEO డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, మాళవిక మోహనన్, చిరంజీవి, మరికొందరు నటీనటులతో పాటు తమిళ నటుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దీని తర్వాత నటి, పొలిటీషియన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలీఖాన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో కోరారు. దీంతో చెన్నై థౌజండ్ లైట్ పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

(ఇదీ చదవండి: 'యానిమల్‌' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్‌ ఎంపీ ఫైర్‌)

ఫిర్యాదు దాఖలైన సమయంలో, మన్సూర్ అలీఖాన్ చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు, మన్సూర్ అలీఖాన్ ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో త్రిషకు మన్సూర్‌ క్షమాపణలు చెప్పాడు. ఆయన క్షమాపణలను కూడా త్రిష అంగీకరించింది.

త్రిష Vs మన్సూర్‌ మధ్య ఏం జరిగిందంటే 
నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కొద్దిరోజుల క్రితం  ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్‌ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని, 'లియో'లో కూడా అలాంటి ఛాన్స్‌ త్రిషతో కూడా ఉంటుందని  భావించినట్లు వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. కానీ లియో సినిమాలో అలాంటి సీన్‌ లేకపోవడంతో తనకు బాధ కలిగిందన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

దీంతో త్రిష కూడా మన్సూర్‌పై ఫైర్‌ అయింది. ఇలాంటి వారితో ఒక్క సినిమాలో కూడా నటించనందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిషకు మెగా స్టార్ చిరంజీవి, నితిన్‌, రోజా, రాధిక, సింగర్ చిన్మయి,లోకేశ్‌ కనగరాజ్‌,కుష్బూ నిలిచారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)