Breaking News

ఆదిపురుష్‌ వల్ల ఎంతో ఏడ్చా..: రచయిత

Published on Sun, 09/29/2024 - 17:38

సినిమా బాగుందంటే జనాలు నెత్తినపెట్టుకుంటారు. అదే తేడా వచ్చిందంటే మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. ప్రభాస్‌ ఆదిపురుష్‌ విషయంలో ఇది నిరూపితమైంది కూడా! ఈ సినిమాలోని క్యారెక్టర్ల లుక్స్‌పై, దాన్ని డిజైన్‌ చేసినవారిపై, డైరెక్టర్‌పై, రచయితపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.

ఏదీ శాశ్వతం కాదు
అలా ఈ ట్రోలింగ్‌ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందంటున్నాడు గేయ, సంభాషణల రచయిత మనోజ్‌ ముంతషీర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మంచి అనిపించింది కాస్తా రేపటికి చెడుగా అనిపించవచ్చు. లేదా ఈరోజు చెడు అనుకుందే రేపు మంచిగా అనిపించనూవచ్చు.

ట్రోలింగ్‌ చూసి ఏడ్చా..
ఆదిపురుష్‌ సమయంలో వచ్చిన ట్రోలింగ్‌ చూసి ఏడ్చాను. కానీ కుంగిపోలేదు. తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను. బాలీవుడ్‌ విషయానికి వస్తే ఇదొక మార్కెట్‌. ఇక్కడ ఎలాంటి నియమనిబంధనలు ఉండవు. కేవలం లాభం ఒక్కటే ఆశిస్తారు. నాతో వారికేదైనా లాభం ఉందనిపిస్తే నాదగ్గరకు వస్తారు. అలా ఇప్పుడు నన్ను మళ్లీ సంప్రదిస్తున్నారు అని మనోజ్‌ చెప్పుకొచ్చాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)