Breaking News

రామ్‌ గోపాల్‌ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్‌ నటుడు

Published on Sat, 05/20/2023 - 16:41

రామ్‌ గోపాల్‌ వర్మ.. చిక్కడు, దొరకడు. ఎవరికీ ఓ పట్టాన అర్థం కాని వర్మ గతంలో ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్‌ ఇచ్చాడు. కానీ ఈ మధ్యే రియల్‌ ఇన్సిడెంట్లను రీల్‌ మీద చూపిస్తానని ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతున్నాడు. ఇకపోతే వర్మ తెరకెక్కించిన హిట్‌ చిత్రాల్లో సత్య మూవీ ఒకటి! ఇందులో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ముఖ్య పాత్రలో నటించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వర్మ తనను మోసం చేశాడని చెప్పాడు.

'సత్య సినిమాలో పరేశ్‌ రావల్‌ గ్యాంగ్‌లో మెయిన్‌ రోల్‌ కోసం రాము (ఆర్జీవీ) వెతుకున్నారని తెలిసి నేను వెళ్లాను. రాము ఉన్న గదిలోకి వెళ్లగానే ఆయన కూర్చోమన్నారు. ఇంతకుముందు ఏం చేశావు? అన్నాడు. మహేశ్‌ భట్‌ సినిమాలో ఓ ముఖ్య పాత్ర అలాగే బందిత్‌ క్వీన్‌ చేశానని బదులిచ్చాను. వెంటనే ఆయన ముఖం వెలిగిపోయింది. బందిత్‌ క్వీన్‌ సినిమాకు ఆయన వీరాభిమాని. ఆ చిత్రాన్ని మూడు,నాలుగు సార్లు చూశాడట!

అందులో ఏ పాత్ర చేశావని అడిగితే మాన్‌ సింగ్‌ రోల్‌ అని చెప్పాను. వెంటనే అతడు లేచి నిలబడి నువ్వసలు మాన్‌ సింగ్‌లానే కనిపించడం లేదు. చూస్తే చిన్నవాడిలా ఉన్నావు. కానీ మాన్‌ సింగ్‌ పాత్రలో బాగా కనిపించావని మెచ్చుకున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'నీకోసం ఐదేళ్లుగా వెతుకుతున్నాను. నాకంతా ఆశ్చర్యంగా ఉంది. నా సినిమాలో నీకు లీడ్‌ రోల్‌ ఇస్తా.. ఇంకేం ఆలోచించకు, నువ్వు మరే సినిమాకు ఒప్పుకోకు. ప్రధాన పాత్రలో నువ్వు మాత్రమే నటిస్తున్నావంతే' అని చెప్పుకొచ్చాడు. అప్పటికే దౌడ్‌ సినిమా మధ్యలో ఉన్న నేను అది ముగించేసరికి ఆర్జీవీ సత్య స్క్రిప్ట్‌ పూర్తి చేశాడు.

ఓ రోజు ఫోన్‌ చేసి నువ్వు సెకండ్‌ లీడ్‌ అన్నాడు. నా మనసు ముక్కలైంది. అతడు మాట తప్పాడు. మోసం చేశాడు. సెకండ్‌ లీడ్‌గా చేయాలా? ఏం లాభం? అని అడిగాను. అతడు ఇంటికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. హీరో పాత్ర కోసం ఎవరినైనా తీసుకోవచ్చు. కానీ బికు మాత్రే పాత్రకు మాత్రం ఓ గొప్ప వ్యక్తి కావాలి. అది నువ్వే అన్నాడు. కానీ సినిమా షూటింగ్‌లోనూ, రిలీజయ్యాక కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది' అన్నాడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఇకపోతే సత్య సినిమాలో జేడీ చక్రవర్తి, ఊర్మిళ మటోండ్కర్‌, సౌరభ్‌ శుక్లా సహా పలువురు నటించారు.

చదవండి: ప్రముఖ నటి ఇంటి మోగనున్న పెళ్లి బాజాలు
కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య నివాళులు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)