Breaking News

ఇళయరాజాకు 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' ఎంత డబ్బు చెల్లించారు..?

Published on Sun, 08/04/2024 - 16:29

'మంజుమ్మెల్‌ బాయ్స్‌' సినిమా రికార్డ్‌ కలెక్షన్లతో సూపర్‌ హిట్‌ అందుకుంది. రూ. 200 కోట్లు కలెక్షన్స్‌ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమాలోని ఒక పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా  'మంజుమ్మెల్‌ బాయ్స్‌' చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90ల నాటి 'గుణ' చిత్రం నుంచి వాడారంటూ ఆ నోటీసుల్లో ఇళయరాజా పేర్కొన్నారు.

ఈ నోటీసులకు 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' చిత్ర నిర్మాత షాన్‌ ఆంటోనీ స్పందించారు.  సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు.  ఆ సాంగ్‌కు సంబంధించ కాపీరైట్‌ కలిగిన రెండు మ్యూజిక్‌ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.

ఈ వివాదంలో ఇళయరాజా  రూ.2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, సమస్యను పరిష్కరించేందుకు 'మంజుమ్మెల్‌ బాయ్స్‌' నిర్మాత రూ.60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై ఇళయరాజా తరపు న్యాయవాది శరవణన్‌ను సంప్రదించగా, ఆయన ఈ సమాచారాన్ని ఖండించారు. నిర్మాత వైపు నుంచి ఇళయరాజాకు ఎలాంటి డబ్బులు అందలేదని ఆయన చెప్పారు. అనంతరం తాము నోటీసు పంపామని తెలిపారు.

ఈ విషయమై మంజుమల్‌ బాయ్స్‌ యూనిట్‌ కూగా రియాక్ట్‌ అయింది. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మా సినిమాలో ఉపయోగించిన 'కణ్మణి అన్బోడు వాలంతన్‌' పాటకు మ్యూజిక్‌ మాస్టర్‌ ఆడియో నుంచి పొందామని వారు వివరించారు. అదేవిధంగా శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. మరి ఇప్పటి వరకు ఇళయరాజాకి తాము ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు