Breaking News

రమ్యకృష్ణ తర్వాత ఆ ఛాన్స్‌ మంజు వారియర్‌కు ఇచ్చిన రజనీకాంత్‌

Published on Fri, 08/02/2024 - 14:18

సీనియర్‌ హీరోలు కమలహాసన్, రజనీకాంత్, అజిత్‌ వంటి వారు తమ వయసుకు తగ్గ కథాపాత్రల్లో నటించడం మొదలెట్టి చాలా కాలమే అయ్యింది. నటుడు విజయ్‌ కూడా లియో చిత్రంతో ఆ తరహా పాత్రల్లో నటించడం మొదలెట్టారు. అలాగు ఈ హీరోలు తమ వయసుకు తగ్గ హీరోయిన్లతోనే నటిస్తున్నారు. అలా నటుడు రజనీకాంత్‌ సమీపకాలంలో సీనియర్‌ నటీమణులతోనే నటిస్తున్నారు. ఈయన పీక్‌ టైమ్‌లో నటించలేని నేటి సీనియర్‌ నటీమణులు సిమ్రాన్, త్రిష, ఈశ్వరీరావు, రమ్యకృష్ణ వంటి వారికి ఇప్పుడు అవకాశాలు వరిస్తున్నాయి. కా

గా తాజాగా నటుడు రజనీకాంత్‌ వేట్టైయాన్‌ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైభీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు నటించని నటుడు ఫాహత్‌ఫాజిల్, రానా దగ్గుపాటి, నటి మంజువారియర్, రిత్వికా సింగ్, దుషారా విజయన్‌ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా నటుడు ఫాహత్‌ ఫాజిల్‌ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి చిత్రం అంతా ఉండే వినోదభరిత పాత్రలో నటించినట్లు సమాచారం. 

అలాగే నటి మంజువారియర్‌ ఇందులో రజనీకాంత్‌కు భార్యగా నటించనట్లు తనే ఒక కార్యక్రమంలో చెప్పారు. మలయాళంలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈమె ఇంతకు ముందు తమిళంలో నటుడు అజిత్‌ సరసన తుణివు, ధనుష్‌కు జంటగా అసురన్‌ వంటి చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా వేట్టైయాన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.     
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)