Breaking News

ఆరు నెలల పోరాటం.. చనిపోవడం ఖాయం అనుకున్నా: హీరామండి నటి

Published on Wed, 11/06/2024 - 16:30

బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా తెలుగువారికి సైతం సుపరిచితమే. చివరిసారిగా హీరామండి వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గతంలో మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా క్యాన్సర్‌ చికిత్స రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను భరించలేని బాధను అనుభవించినట్లు తెలిపారు. చికిత్స తీసుకునే సమయంల తాను చనిపోతానని భావించినట్లు వెల్లడించింది. కొన్ని నెలల పాటు అమెరికాలో  శస్త్రచికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన తల్లి నేపాల్ నుంచి  రుద్రాక్షను తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చిందని మనీషా చెప్పుకొచ్చింది. కాగా.. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.

మనీషా మాట్లాడుతూ..'2012లో నాకు క్యాన్సర్ నిర్ధారణ జరిగింది. ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను. నేను వైద్యులతో మాట్లాడినప్పుడు చనిపోతానని భావించా. ఇక లైఫ్‌కు ముగిసినట్లే అనిపించింది. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో భరించలేని బాధ, నొప్పి అనుభవించా. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. చివరి స్టేజ్‌లో ఉందని తెలిసింది. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు నాకు చికిత్స అందించారు. దాదాపు 11 గంటలు ఆపరేషన్‌ చేశారు. కీమో థెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులు వివరించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో అమ్మ నాకోసం ఎన్నో పూజలు చేసింది. ఆమె ధైర్యంతోనే నేను ఆ మహమ్మారిని జయించాను. ఈ జీవితం నాకు దేవుడిచ్చిన పునర్జన్మ'  అని అన్నారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)