amp pages | Sakshi

‘జిన్నా’ నవ్వి నవ్వి కడుపునొస్తుంది: మంచు విష్ణు

Published on Fri, 10/21/2022 - 08:13

‘‘జిన్నా’ ని రెండు షోలు ప్రివ్యూ వేశాం.. చూసిన వారందరూ విపరీతంగా ఎంజాయ్‌ చేశారు. మా అమ్మ, అత్తగార్లు కూడా చప్పట్లు కొట్టేసి నవ్వుతూ ఎంజాయ్‌ చేశారు. అప్పుడు వచ్చిన నమ్మకంతోనే ‘జిన్నా’ని ఎక్కువగా ప్రమోట్‌ చేశాను. నేను, ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్‌ చంద్ర సెకండాఫ్‌లో కడుపుబ్బా నవ్విస్తాం.. నవ్వి నవ్వి ప్రేక్షకులకు కడుపునొస్తుంది’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు పంచుకున్న విశేషాలు... 

మా నాన్న(మోహన్‌ బాబు) ‘జిన్నా’ చిత్రాన్ని ‘ఢీ’ సినిమాతో పోల్చారు. ‘ఢీ’ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాం. విడుదలయ్యాక అది కల్ట్‌ సినిమా అయింది. ‘ఢీ’లో ఇంటర్వెల్‌కు అంత సర్‌ప్రైజ్‌ అనిపించదు. కానీ, ‘జిన్నా’లో ఇంటర్వెల్‌కు అందరూ సర్‌ప్రైజ్‌ షాక్‌ అవుతారు. అయితే ‘జిన్నా’’ మూవీ ‘ఢీ’ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ∙యాక్షన్‌ కామెడీ జానర్‌లో నేను చేసిన సినిమాలన్నీ హిట్లు ఇచ్చాయి. మధ్యలో వేరే జానర్స్‌ ప్రయత్నించి, తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ‘జిన్నా’ చేశా. ప్రతి సినిమా బాగుండాలనే అందరూ అనుకుంటాం.. కానీ, ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ∙‘జిన్నా’లో నా పాత్ర పేరు గాలి నాగేశ్వరావు. జీనా అని పిలిస్తే బాగుండదు.. అందుకే జిన్నా అని పెట్టాం. జిన్నా అప్పు చేసి 
టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్‌ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అప్పు ఎలా తీర్చాడు?. అన్నదే ఈ చిత్ర కథ. 

‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలకు ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా? అని నాన్నని అడిగాను. ‘ప్రిపరేషన్‌ లేదు.. మన పాత్ర చెబుతారు.. దాన్నే 
దృష్టిలో పెట్టుకుని చేయాలి’ అని ఆయన చెప్పడంతో షాక్‌ అయ్యాను. ‘జిన్నా’ కోసం నేను చిత్తూరు యాస మాట్లాడాల్సి వచ్చింది.. దాని కోసం కష్టపడ్డాను. జి.నాగేశ్వరరెడ్డిగారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి శ్రీనువైట్లగారి అసిస్టెంట్‌ సూర్యను డైరెక్టర్‌గా తీసుకున్నాం. 


► ఈ చిత్రానికి మూల కథ జి.నాగేశ్వరరెడ్డిగారు అందించారు. ‘జిన్నా’ కోసం కోన వెంకట్‌గారు ప్రతి రోజూ పని చేశారు.. ఆయనకు చాలా థ్యాంక్స్‌. మనకు జనాలతో కనెక్షన్‌ ఉండాలంటే సోషల్‌ మీడియాలో ఉండక తప్పదు. అయితే ఇందులో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే. ∙‘జిన్నా’తో నా కెరీర్‌లో ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు అనూప్‌ రూబె¯Œ ్స. ఈ చిత్రంలో చిన్నపిల్లల ట్రాక్‌ని నా కుమార్తెలు అరియానా, వీవీయానా పాడాలనే ఆలోచన నాదే. దీనిపై అనూప్‌ తొలుత సందేహపడ్డా, వారి పాట విన్నాక సంతోషించాడు. భవిష్యత్తులో వాళ్లు మంచి సింగర్లు కావాలని కోరుకుంటున్నాను.. కానీ వాళ్లకి నటీమణులు కావాలని ఉంది.

నేను నటించే సినిమాలు మా అమ్మ, నా పిల్లలతో కలిసి చూసేలా ఉండాలనుకుంటున్నా. ప్రభుదేవా, ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌లు డ్యాన్స్‌ విషయంలో బాగా కష్టపెట్టారు. నా కెరీర్‌లో బెస్ట్‌ సాంగ్స్, డ్యాన్స్‌లు  ‘జిన్నా’ లో ఉన్నాయి. 

► కొన్ని సినిమాల రీమేక్‌ హక్కులు కొన్నాను. మా ప్రొడక్షన్‌లో వేరే హీరోలతోనూ ఆ సినిమాలు చేస్తాను. నవంబర్‌లో ఆ చిత్రాల గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతానికి యాక్షన్‌ కామెడీ జానర్‌లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. శ్రీను వైట్లగారు, నేను కలిసి చేయనున్న చిత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్‌ అవుతుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చర్చలు జరుగుతున్నాయి. 

► ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) టీమ్‌లో అంతా మంచి వాళ్లున్నారు. వారు బాగా పని చేస్తుండటంతో నేను ఓ వైపు హీరోగా, మరోవైపు ‘మా’ అధ్యక్షునిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ‘మా’ అధ్యక్షునిగా మళ్లీ పోటీ చేయనన్నాను. నా కంటే ఇంకా మంచి ప్రెసిడెంట్‌ రావొచ్చేమో? ఒక వేళ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను చేయమంటే చేస్తాను. అయితే ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)