Breaking News

చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం: మోహన్‌ బాబు

Published on Tue, 12/10/2024 - 11:10

మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంపై మోహన్‌ బాబు స్పందించారు. తమ ఇంట్లో జరుగుతున్నది చిన్న తగాదా అని.. అది తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన పెద్ద కొడుకు మంచు విష్ణుకు స్వాగతం పలికేందుకు మంగళవారం ఉదయం మోహన్‌ బాబు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అనంతరం విష్ణుతో కలిసి ఒకే కారులో జల్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ ఇంట్లో నైనా అన్నదమ్ముల మధ్య  గొడవలు సహజంగానే జరుగుతాయి. మా ఇంట్లో కూడా అలాంటి చిన్న గొడవే జరిగింది. అది అంతర్గతంగా చర్చించుకుంటాం. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది.. పరిష్కరించుకుంటాం. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను నేను పరిష్కరించాను. అందరిని కలిపే ప్రయత్నం చేశాం. మా ఫ్యామిలీ సమస్యను కూడా త్వరనే పరిష్కరించుకుంటాం’అని అన్నారు.

కొడుకుపై ఫిర్యాదు.. స్పందించిన మనోజ్‌
గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్‌ సోమవారం పోలీసుకుల ఫిర్యాదు చేయడంతో మంచు ఫ్యామిలీ గొడవ మరింత పెద్దదైంది. మనోజ్‌ ఫిర్యాదు చేసిన గంటలోనే మోహన్‌ బాబు కొడుకు మనోజ్‌పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చిన్న కుమారుడు మనోజ్‌తో ప్రాణహానీ ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మనోజ్‌తో పాటు అతని భార్య మౌనికపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.

తండ్రి ఫిర్యాదుపై మనోజ్‌ స్పందిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తనపై, తన భార్య మౌనికపై మోహన్‌ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ‘నా పరువు తీయడానికి, నా గొంతు నొక్కడానికే మా నాన్న మోహన్‌ బాబు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు’ అంటూ మనోజ్‌ సోషల్‌ మీడియాలో ఓ సుదీర్గమైన పోస్ట్‌ పెట్టారు. 

అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం : మోహన్ బాబు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)