మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
Breaking News
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్‌లో మోహన్‌బాబు
Published on Mon, 03/23/2026 - 07:57
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ వేడుకకు లక్ష్మి తల్లితో పాటు, సోదరుడు మంచు మనోజ్ భార్యాపిల్లలతో సహా హాజరయ్యాడు. ఎంతో సంబరంగా మేనకోడలిని పల్లకిలో ఎక్కించుకుని మరీ ఊరేగాడు. మరో సోదరుడు విష్ణు, తండ్రి మోహన్‌బాబు మాత్రం ఫంక్షన్‌లో ఎక్కడా కనిపించలేదు.

మరోసారి ఫంక్షన్
దీంతో మంచు కుటుంబంలో విభేదాలు తగ్గలేదా? అన్న అనుమానం మొదలైంది. తాజాగా మరోసారి హాఫ్ శారీ ఫంక్షన్‌కు సంబంధించిన ఈవెంట్ నిర్వహించడం చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. నిర్వాణ ఓణీల ఫంక్షన్‌ను మరోసారి ఇంట్లో గ్రాండ్‌గా నిర్వహించారు. తనకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
హాజరవని విష్ణు
ఈ వేడుకను మోహన్‌బాబు దంపతులు దగ్గరుండి చూసుకున్నారు. మనవరాలిని మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు భార్య విరానిక, వారి పిల్లలు సైతం హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరవలేదు. అలాగే మనోజ్ దంపతులు కూడా ఈ ఫంక్షన్‌లో కనిపించలేదు. దీంతో విడిపోయిన కుటుంబం కోసం రెండుసార్లు ఈ వేడుక జరిపినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Tags : 1