Breaking News

మై డార్లింగ్‌ వైఫ్‌, మాటిస్తున్నా.. మంచు మనోజ్‌ స్పెషల్‌ పోస్ట్‌

Published on Wed, 10/04/2023 - 15:08

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌- భూమా మౌనిక ఈ ఏడాది మార్చిలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మంచు లక్ష్మి ఇంట ఈ వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా మౌనిక మెడలో మూడు ముళ్లు వేయడమే కాకుండా ఇకపై తన కుమారుడు ధైరవ్‌ నాగిరెడ్డి బాధ్యత కూడా తనదేనని గొప్ప మనసు చాటుకున్నాడు. నేడు(అక్టోబర్‌ 4) మౌనిక బర్త్‌డే.. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

'ప్రియమైన మున్నిలు.. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీపై నాకున్న ప్రేమను, ఇష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది నువ్వే.. మనల్ని కలిపిన కాలానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మా జీవితాల్లో వెలకట్టలేనంత సంతోషాన్ని తీసుకొచ్చావు, నవ్వుల్ని పంచావు. నీ నిస్స్వార్థ ప్రేమ, నువ్వు చూపించే కేరింగ్‌ను మాటల్లో చెప్పలేను. నువ్వు, ధైరవ్‌.. నా జీవితంలోకి రావడం నా అదృష్టం. 

నీ మనసెంత మంచిదంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్లందరి ముఖాల్లోనూ చిరునవ్వును తీసుకొస్తావు. నీ చుట్టూ ఉన్నవారందరికీ ప్రేమను పంచుతావు. నాకున్న కోరికల్లా ఒక్కటే.. ఎల్లప్పుడూ నువ్వు సుఖసంతోషాలతో ఉండాలి. నీకంతా మంచే జరగాలి మై లవ్‌.. నీపై ఎప్పటికీ ప్రేమను కురిపిస్తూనే ఉంటానని మాటిస్తున్నాను. నీ ఆనందమే నాక్కావాల్సింది. దానికోసం నేనేదైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను.

ఈ బర్త్‌డే సందర్భంగా మనం కలిసున్న సుమధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను మున్నిలు.. నీ వ్యక్తిత్వాన్ని తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతోంది. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్‌ వైఫ్‌. నీ మనసు కోరుకున్నదంతా నీకు దక్కాలని కోరుకుంటున్నాను.. ధైరవ్‌, జోయాతో పాటు నా తరపునుంచి కూడా మరోసారి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని రాసుకొచ్చాడు.

చదవండి: 2015లో పెళ్లి.. పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర నటి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)